కలం, వెబ్ డెస్క్: గుంటూరులోని మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ఇంటి వద్ద హై టెన్షన్ నెలకొన్నది. వైసీపీ ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా పాపపరిహార ర్యాలీలు నిర్వహించారు. గుంటూరులో ర్యాలీ నిర్వహిస్తుండగా ఉద్రిక్తత చోటు చేసుకున్నది. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొన్నది. ఈ సందర్భంగా అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. ఆయన చంద్రబాబును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి ఇంటిని ముట్టడించేందుకు భారీగా అక్కడికి చేరుకున్నారు. టీడీపీ మహిళా కార్యకర్తలు భారీ సంఖ్యలో అంబటి ఇంటిముందుకు చేరుకొని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు వైసీపీ శ్రేణులు కూడా చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొన్నది. ఇక అంబటి రాంబాబుపై ఏపీలోని పలు పీఎస్‌ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న చర్చలు కూడా సాగుతున్నాయి.


