కలం, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) ఎట్టకేలకు విచారణకు హాజరు కావాలని కేసీఆర్ (KCR) నిర్ణయించుకున్నారు. న్యాయ నిపుణులతో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలోనే సిట్ ఎంక్వయిరీ జరగనున్నది. ఇందుకోసం ఆదివారం ఉదయం ఎర్రవల్లి ఫామ్ హౌజ్ నుంచి కేసీఆర్ హైదరాబాద్‌కు వస్తున్నారు. మరోవైపు కేసీఆర్‌ను విచారణకు పిలవడంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.
అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించాలని పార్టీ పిలుపునిచ్చింది. ఉద్దేశపూర్వకంగానే, రాజకీయ కక్షసాధింపు చర్యలతోనే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కేసీఆర్‌ను ఫోన్ ట్యాపింగ్ ఎంక్వయిరీకి పిలుస్తున్నదని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు. కేసీఆర్ (KCR) విచారణ జరిగే సమయంలో కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురు సీనియర్ నేతలు తెలంగాణ భవన్లో ఉండి మీడియా సమావేశాల్లో మాట్లాడనున్నారు.
Read Also: మున్సిపల్ ఎన్నికల ప్రచారం.. సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ మార్పు
Follow Us On: X(Twitter)


