epaper
Saturday, January 31, 2026
spot_img
epaper

‘ఇరుముడి’ నుంచి ఇంట్రస్టింగ్ న్యూస్..

కలం, సినిమా​ : మాస్ మహారాజా రవితేజ హిట్టు కోసం తపిస్తున్నాడు.. కష్టపడుతున్నాడు.. కానీ.. సక్సెస్ మాత్రం రావడం లేదు. సంక్రాంతికి వచ్చిన భర్త మహాశయులకు విజ్ఞప్తి ఫరవాలేదు అనిపించింది. ఈమధ్య కాలంలో రవితేజ నుంచి వచ్చిన సినిమాల్లో బెస్ట్ అనిపించింది కానీ.. హిట్ సాధించలేకపోయింది. దీంతో ఇప్పుడు ఖచ్చితంగా హిట్ సాధించాల్సిన పరిస్థితి. ఇరుముడి (Irumudi Movie) అంటూ రూటు మార్చాడు. అయితే.. ఈ మూవీ గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ.. ఏంటా న్యూస్..?

రవితేజ హీరోగా శివ నిర్వాణ డైరెక్షన్ లో ఇరుముడి అనే మూవీని ఇటీవల అనౌన్స్ చేశారు. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. అయ్యప్ప మాల ధరించి ఉన్న రవితేజ.. చాలా కొత్తగా కనిపించాడు. ఈమధ్య రొటీన్ మాస్ మసాలా సినిమాలే చేస్తున్న మాస్ రాజాకి ఇది కొత్త తరహా సినిమా.. కొత్త క్యారెక్టర్ అనే ఫీలింగ్‌ కలిగించింది. అయితే.. వరుస ఫ్లాపుల్లో ఉన్న రవితేజకు హిట్టు కావాలి అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఇరుముడి మూవీ కథ, కథనం, హీరో క్యారెక్టరైజేషన్ లోనూ మార్పు క్లియర్ గా కనిపిస్తోంది.

ర‌వితేజ ఈ సినిమా (Irumudi Movie) లో డ్యూయల్ రోల్ చేస్తున్నారనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. అయితే.. రెండు పాత్రలు చేయడం రవితేజకు కొత్తేమీ కాదు.. కానీ ఈసారి రెండు పాత్ర‌ల్లో వేరియేష‌న్స్ చాలా బాగా కుదిరాయ‌న్న టాక్ మాత్రం వినిపిస్తోంది. రెండు పాత్ర‌లా, మూడు పాత్ర‌లా అనేది ఇప్పుడు ప్ర‌ధానం కాదు. ర‌వితేజ హిట్టు కొట్టాలంతే.. హిట్టు కోసం ఆయ‌న ఏ మేర‌కు త‌న‌ని తాను మార్చుకున్నారనేది ఆసక్తిగా మారింది. టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ లోనే మార్పు కనిపించింది కాబట్టి కథ కూడా కొత్తగా ఉంటుంది.. ఈ మూవీ రవితేజ ఆశించిన హిట్టు ఇవ్వడం ఖాయం అనిపిస్తోంది. మరి.. ఇరుముడితో మాస్ రాజా హిట్టు కొడతాడేమో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>