epaper
Sunday, February 1, 2026
spot_img
epaper

హైదరాబాద్‌లో రైలు కింద ప‌డి కుటుంబం ఆత్మ‌హ‌త్య‌

క‌లం, వెబ్‌ డెస్క్‌: హైద‌రాబాద్‌లో (Hyderabad) విషాద‌క‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. రైలు కింద ప‌డి ఓ కుటుంబం ఆత్మ‌హ‌త్య (Family Suicide) చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో కుటుంబంలోని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బోడుప్ప‌ల్‌లోని (Boduppal) హ‌రిత‌హారం కాల‌నీకి చెందిన సురేంద‌ర్ రెడ్డి దుబాయ్‌లో ఉన్నారు. ఆయ‌న భార్య విజ‌య శ‌నివారం తెల్ల‌వారుజామున‌ కూతురు చేత‌న, కొడుకు విశాల్ క‌లిసి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. చర్ల‌ప‌ల్లి-ఘ‌ట్‌కేస‌ర్ రైల్వే స్టేష‌న్ల మ‌ధ్య ఈ ఘ‌ట‌న జ‌రిగింది. రైల్వే ట్రాక్‌పై మృత‌దేహాల‌ను చూసి గూడ్స్ రైలు లోకోపైల‌ట్ పోలీసుల‌కు స‌మాచారం అందించాడు. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని ప‌రిశీలించారు. పోస్ట్ మార్టం కోసం మృత‌దేహాల‌ను గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మ‌రోవైపు సురేంద‌ర్ రెడ్డి నెల్లూరులో ఉన్నార‌ని పోలీసుల‌కు స‌మాచారం అందిన‌ట్లు తెల‌స్తోంది. అస‌లు సురేంద‌ర్ రెడ్డి ఎక్క‌డున్నారు? ఆయ‌న కుటుంబం ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుకుంది? అనే వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Read Also: మంత్రుల‌తో సీఎం రేవంత్ జూమ్ మీటింగ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>