కలం, వెబ్ డెస్క్: ఆస్ట్రేలియాతో టీ20 (T20) సిరీస్ ఆడుతున్న పాక్ స్క్వాడ్‌ల కీలక మార్పు చోటు చేసుకుంది. పేస్ బౌలర్ వసీమ్ జూనియర్‌ను (Wasim Junior) జట్టు నుంచి తొలగిస్తూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది. సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లకు జట్టు నుంచి విడుదల చేసినట్టు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తాజాగా వెల్లడించింది.మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టీ20లో వసీమ్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత సిరీస్ కొనసాగుతుండగానే అతడిని జట్టు నుంచి తప్పించారు.
ఇటీవల శ్రీలంక పర్యటనలో వసీమ్ రెండు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు తీసి మంచి ప్రదర్శన చూపించాడు. సగటు కూడా ఆకట్టుకునేలా ఉంది. అయినా ఆస్ట్రేలియా సిరీస్‌లో అతడికి అవకాశం రాలేదు. రాబోయే టీ20 ప్రపంచకప్ 2026 జట్టులోనూ వసీమ్ (Wasim Junior) ఎంపిక కాలేదు. ఇదిలా ఉండగా పాకిస్థాన్-ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 మ్యాచ్ రేపు లాహోర్ గద్దాఫీ స్టేడియంలో జరగనుంది. తాజా మార్పులతో పాకిస్థాన్ జట్టు తదుపరి మ్యాచ్‌కు సిద్ధమవుతోంది.
Read Also: టీ20 వరల్డ్‌కప్ 2026 సాంగ్.. అదరగొట్టిన అనిరుధ్
Follow Us On: Sharechat


