తల్లిదండ్రుల మిస్సింగ్ కేసులో షాకింగ్ నిజాలు

కలం, వెబ్ డెస్క్: కర్ణాటక (Karnataka) రాష్ట్రం విజయనగర జిల్లా కొట్టూరు గ్రామంలో దారుణం చోటు చేసుకున్నది. ఓ యవకుడు తన తల్లిదండ్రులను, సోదరిని చంపేసి ఇంట్లోనే పాతిపెట్టాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొట్టూరు గ్రామానికి చెందిన అక్షయ్ కుమార్ టైర్ల దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. తల్లి జయలక్ష్మి(45), తండ్రి భీమరాజ్‌(50), చెల్లి అమృత(17)తో కలిసి ఉంటున్నాడు.

ఈ నెల 27నుంచి కుటుంబ సభ్యులు కనిపించడం లేదని అక్షయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్షయ్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు అతడిని లోతుగా ప్రశ్నించారు. విచారణ క్రమంలో అక్షయ్ కుమార్ తానే తల్లిదండ్రులు, సోదరిని హత్య చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. అక్షయ్ తల్లిదండ్రులు, చెల్లిని ఇంట్లోనే దారుణంగా హత్య చేసిన అనంతరం, వారి మృతదేహాలను ఇంటి ప్రాంగణంలోనే పాతిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే హత్యలకు గల అసలు కారణాలు ఏమిటనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలా? లేక మరేదైనా కారణమా అన్న అంశాలపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హత్యకు గురవడం, నిందితుడు కుటుంబసభ్యుడే కావడం సంచలనంగా మారింది.

Read Also: యాదాద్రిలో గోల్డ్ స్కామ్ కేసు.. ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>