కలం, నల్లగొండ బ్యూరో : చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో(Chityal Municipal Election) ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పురపోరులో తొలిసారిగా ఓ ట్రాన్స్‌జెండర్(Transgender) ప్రత్యక్షంగా బరిలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. చిట్యాల(Chityal) మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డు శివనేనిగూడెనికి చెందిన నాగిళ్ల కావేరి సుధాకర్ కౌన్సిలర్‌గా శుక్రవారం తన నామినేషన్ వేశారు. కావేరి సుధాకర్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. శుక్రవారం నామినేషన్ల స్వీకరణకు తుది గడువు కావడంతో తన మద్దతుదారులతో కలిసి వచ్చి ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు పత్రాలు సమర్పించారు. సామాజిక మార్పు కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం తాను పోటీ చేస్తున్నట్లు కావేరి సుధాకర్ పేర్కొన్నారు.


