కలం, వెబ్ డెస్క్: జమ్మూ కశ్మీర్‌లోని కిష్త్వార్(Kishtwar) జిల్లా డోల్గామ్ ప్రాంతంలో శనివారం ఉదయం ఎన్ కౌంటర్(Encounter) జరిగినట్లు తెలుస్తోంది. స్థానికంగా ఉగ్రవాదులు(Terrorists) ఉన్నట్లు భద్రతా దళాలకు సమాచారం అందింది. గత పదిహేను రోజుల నుంచి ఇక్కడ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. భద్రతా దళాలు ఈ రోజు ఉదయం ముగ్గురు జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రవాదులను గుర్తించినట్లు సమాచారం. గతంలో ఇక్కడే కొంతమంది ఉగ్రవాదులు సైన్యం నుంచి తప్పించుకెళ్లగా తాజాగా సైన్యం వారిని పట్టుకోవడానికి విస్తృత స్థాయిలో ఆపరేషన్లు చేపట్టింది. ఇందులో భాగంలో నేడు ఉదయం కాల్పులు జరిగినట్లు సమాచారం. పొలీసులు, సైన్యం సమన్వయంతో వ్యవహరిస్తూ స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.


