కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని కోఠి(Koti)లో శనివారం ఉదయం తుపాకీ కాల్పుల(Gunfire)తో కలకలం నెలకొంది. కోఠిలోని ఎస్‌బీఐ ఏటీఎం(SBI ATM)లో డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చిన ఓ వ్యక్తి పై దుండగులు కాల్పులు జరిపి నగదు ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. రషీద్ అనే వ్యక్తి రూ.6 లక్షలు డిపాజిట్ చేసేందుకు కోఠిలోని ఎస్‌బీఐ ఏటీఎం వద్దకు బయలుదేరాడు. కొద్ది దూరం నుంచే దుండగులు రషీద్‌ను ఫాలో అవుతూ వచ్చారు. కానీ, రషీద్ ఈ వీరిని గుర్తించలేదు. రషీద్ ఏటీఎం వద్దకు రాగానే దుండగులు అతడిపై కాల్పులు జరిపి రూ.6 లక్షలు ఎత్తుకెళ్లారు. ఈ కాల్పుల్లో రషీద్ గాలికి గాయమైంది. సమాచారం అందుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రషీద్‌ను ఆస్పత్రికి తరలించారు. దుండగులను గుర్తించేందుకు పోలీసులు స్థానిక సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు.


