కలం, స్పోర్ట్స్: భారత యువ బ్యాటింగ్ స్టార్ తిలక్ వర్మ (Tilak Varma) రీఎంట్రీకి రెడీ అవుతున్నాడు. ఇటీవల శస్త్రచికిత్స కారణంగా క్రికెట్‌కు బ్రేక్ ఇచ్చిన తిలక్.. తన ఫిట్‌నెస్‌పై కసరత్తులు చేస్తున్నాడు. 2026 టీ20 వరల్డ్ కప్‌కు (T20 World Cup) ముందు అతని ఫిట్‌నెస్‌పై కీలక నిర్ణయం తీసుకునేందుకు బీసీసీఐ (BCCI) బెంగళూరులో సిమ్యులేషన్ మ్యాచ్ నిర్వహించనుంది. ఇటీవల అబ్డొమినల్ సర్జరీ చేయించుకున్న తిలక్, వరల్డ్ కప్‌లో పాల్గొనగలడా అనే సందేహాలు తలెత్తాయి. అతని రికవరీ క్రమంగా మెరుగుపడడంతో ఇప్పుడు మెడికల్ క్లియరెన్స్ దశకు చేరుకున్నాడు.
శుక్రవారం జరగనున్న ఈ సిమ్యులేషన్ గేమ్ అతని మ్యాచ్ రెడీనెస్‌కు చివరి పరీక్షగా ఉండనుంది. ఈ టెస్ట్‌లో ఫిట్‌గా తేలితే ఫిబ్రవరి 3న భారత వరల్డ్ కప్ జట్టుతో చేరే అవకాశం ఉంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్ చివరి దశల్లో తిలక్ తిరిగి రావచ్చని భావించినా, పూర్తి మ్యాచ్ ఫిట్‌నెస్ (Fitness) కోసం ఇంకా సమయం అవసరమని బీసీసీఐ స్పష్టం చేసింది. అందుకే సిరీస్ మిగతా మ్యాచ్‌లకు శ్రేయస్ అయ్యర్‌ను జట్టులో కొనసాగించారు.
ఇదే సమయంలో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్‌పైనా భారత జట్టు దృష్టి పెట్టింది. రిబ్ (Rishabh Pant) గాయం నుంచి కోలుకుంటున్న అతనికి కూడా త్వరలో ఇలాంటి పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. వరల్డ్ కప్ సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో పూర్తిగా ఫిట్‌గా ఉన్న ఆటగాళ్లతోనే బరిలోకి దిగాలని బీసీసీఐ (BCCI) జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. తిలక్ వర్మ (Tilak Varma), వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్ పరీక్షలు త్వరలో తుది నిర్ణయానికి దారితీయనున్నాయి.
Read Also: ట్యాక్సీ డ్రైవర్ దోపిడీ.. 400 మీటర్ల జర్నీకి రూ.18 వేలు వసూలు
Follow Us On: Sharechat


