కలం, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నియామకంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) ఏ నిర్ణయం తీసుకున్నా తాము దానికి కట్టుబడి ఉంటామని ఆయన తెలిపారు. అజిత్ పవార్ కుటుంబం, ఎన్సీపీకి ప్రభుత్వ పరంగానే కాకుండా, భారతీయ జనతా పార్టీ తరపున కూడా పూర్తి స్థాయిలో అండగా ఉంటామని పేర్కొన్నారు.
తమ కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎన్సీపీ తీసుకునే ప్రతి నిర్ణయానికి తాము పూర్తి మద్దతు ఇస్తామని, పూర్తి స్థాయిలో వారి వెనుక నిలబడతామని ఫడ్నవిస్ ఈ సందర్భంగా తెలిపారు. డిప్యూటీ సీఎం ఎంపిక పూర్తిగా ఆ పార్టీ అంతర్గత విషయమని, వారు ఎవరిని సూచించినా ప్రభుత్వం ఆమోదిస్తుందని ఫడ్నవిస్ (Devendra Fadnavis) పేర్కొన్నారు.


