కలం, వెబ్ డెస్క్ : SIT Summons KCR | ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ సెకండ్ నోటీసులు జారీచేసింది. ఫిబ్రవరి 1న హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలో రెడీగా ఉండాలని సూచించింది. మధ్యాహ్నం 3.00 గంటలకు విచారిస్తామని ఆ నోటీసుల్లో జూబ్లీ హిల్స్ ఏసీపీ వెంకటగిరి పేర్కొన్నారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌజ్‌లోనే విచారించాలని కేసీఆర్ చేసిన రిక్వెస్టును సిట్ పోలీసులు తిరస్కరించారు. హైదరాబాద్ పరిధిలో ఎక్కడ వసతిగా ఉంటుందో ప్లేస్ చెప్పాలంటూ ఫస్ట్ నోటీసులోనే సిట్ పోలీసులు కేసీఆర్‌కు సూచించారు.
వారి సూచనలకు భిన్నంగా సీఆర్పీసీ (CRPC)లోని సెక్షన్ 160 ప్రకారం 65 ఏండ్ల వయసు దాటినవారు ఎక్కడ నివసిస్తూ ఉంటే అక్కడే విచారించాలన్న నిబంధనను ప్రస్తావించి ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌లోనే ఎంక్వయిరీ చేయాలని సిట్‌కు రాసిన లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. కానీ దానికి సిట్ అంగీకరించలేదు. హైదరాబాద్ లోని నందినగర్‌లో నివాసం ఉన్నందున అక్కడే విచారిస్తామని, ఫిబ్రవరి 1 (ఆదివారం) మధ్యాహ్యనం 3.00 గంటలకు ఎంక్వయిరీకి సిద్ధంగా ఉండాలని తాజా నోటీసుల్లో సిట్ స్పష్టం చేసింది. దీనికి కేసీఆర్ ఎలా సిద్ధమవుతారన్నది సస్పెన్స్.
Read Also: ట్యాక్సీ డ్రైవర్ దోపిడీ.. 400 మీటర్ల జర్నీకి రూ.18 వేలు వసూలు
Follow Us On : WhatsApp


