కలం, ఖమ్మం బ్యూరో: అసియాలో అతిపెద్ద జాతరైన మేడారం (Medaram)కి ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు సీట్ల సామర్థ్యానికి మించి జనాలను ఎక్కించుకోవడం, అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా మణుగూరు (Manuguru) నుంచి మేడారం వెళ్లడానికి టికెట్ రూ. 110 ఉంటుంది. కానీ స్పెషల్ బస్సుల పేరు చెప్పి ప్రస్తుతం రూ.210 వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేడారంకి రద్దీ ఎక్కువగా ఉంటంతో ఆర్టీసీ ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉమ్మడి జిల్లా నుంచి అరగంటకు బస్ చొప్పున నడుపుతున్నప్పటికీ, పూర్తి కండిషన్లో లేనట్లు తెలుస్తోంది. ప్రధానంగా కొన్ని బస్సుల్లో సీట్లతోపాటు కిటికీ అద్దాలు సైతం సరిగ్గా లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కొన్ని బస్సులకు ఇంజిన్, గేర్ బాక్స్ సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ఓ రాత్రి భద్రాచలం (Bhadrachalam) నుంచి మేడారం (Manuguru) బయలుదేరిన బస్సు ఏటూరు నాగారం కమలాపురం అడవి మధ్యలో గేర్ రాడ్ విరిగి ఆగిపోయింది. సుమారు గంట పాటు మరో బస్సు కోసం ప్రయాణికులు ఎదురుచూడాల్సివచ్చింది. ఆర్టీసీ యాజమాన్యం ఛార్జీల వసూలు మీద పెట్టిన శ్రద్ధ బస్సుల కండిషన్ మీద పెట్టడం లేదని భక్తులు మండిపడుతున్నారు.
Read Also: నిఘా నీడలో చోరీకి యత్నం..
Follow Us On: Instagram


