కలం, వెబ్ డెస్క్ : సుమారు రెండు గంటల పాటు కొనసాగిన కేంద్ర జల వివాదాల (Water Disputes) పరిష్కార కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాలపై ప్రధానంగా చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా మాట్లాడుతూ.. రాష్ట్రం తరపున మొత్తం 12 అంశాలను చర్చకు ప్రతిపాదించినట్లు తెలిపారు. కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు కీలక సమస్యలను ఈ సందర్భంగా కమిటీ దృష్టికి తీసుకెళ్లారు.
సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం కొన్ని కీలక డిమాండ్లను ఉంచింది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టును చర్చ అజెండాలో చేర్చవద్దని తెలిపింది. అలాగే నల్లమల సాగర్ ప్రాజెక్టును కూడా ఈ చర్చల పరిధిలోకి తీసుకురావద్దని చెప్పినట్లు రాహుల్ బొజ్జా (Rahul Bojja) పేర్కొన్నారు. కాగా ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన అజెండాను సమర్పించలేదని రాహుల్ బొజ్జా తెలిపారు. ఉమ్మడి సమస్యలపై చర్చలు జరిగినప్పటికీ ఏపీ నుంచి నిర్దిష్టమైన అంశాల జాబితా రాలేదని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఈ జల వివాదాల (Water Disputes) పరిష్కారానికి సంబంధించి తదుపరి సమావేశం ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై కేంద్ర జల సంఘం (CWC) తుది నిర్ణయం తీసుకోనుందని ఆయన తెలిపారు.
Read Also: మోదీ గవర్నమెంట్ నెక్ట్స్ టార్గెట్ ఆర్టీఐ.. ఖర్గే
Follow Us On: Instagram


