కలం, వరంగల్ బ్యూరో: పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నా కల్తీకి బ్రేక్ పడటం లేదు. మార్కెట్లో ప్రతి వస్తువు కల్తీ అవుతోంది. ఈ నేపథ్యంలో హనుమకొండ (Hanamkonda) జిల్లా గూడెప్పాడు సెంటర్‌లోని ఎంఎం మార్ట్‌లో అధికారులు నకిలీ టీ పొడిని స్వాధీనం చేసుకున్నారు.
ప్రాణాంతక క్యాన్సర్‌కు కారణమైన జుట్టుకు వేసే కలర్‌తో తయారుచేసిన టీ పొడిని విక్రయిస్తున్నారని అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఫుడ్ ఇన్స్పెక్టర్లు కృష్ణమూర్తి, మౌనిక తనిఖీ చేసి నకిలీ టీ పొడి (Tea Powder)ని స్వాధీనం చేసుకున్నారు. టీ పొడిలో నీళ్లు పోయగానే రంగులోకి మారితే అది నకిలీ అని, రంగు మారకుంటే అది ఒరిజినల్ అని పుడ్ సేఫ్టీ అధికారులు వివరించారు.
Read Also: ఈ క్రెడిట్ కార్డులపై కొత్త రూల్స్.. వాళ్లకు నిరాశే..
Follow Us On: Instagram


