కలం, వెబ్‌డెస్క్: భారత్‌కు వరల్డ్ బ్యాంక్ (World Bank) గ్రూప్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఐదేళ్ల పాటు ఏటా 8 నుంచి 10 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించనుంది. ఈ మేరకు భారత్, వరల్డ్ బ్యాంక్ గ్రూప్ మధ్య కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్‌వర్క్(సీపీఎఫ్) కుదిరింది. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించడానికి అవసరమయ్యే ఆర్థిక కార్యక్రమాలకు, ఉపాధికి ఈ సీపీఎఫ్ బూస్టప్‌లా పనిచేయనుంది.
వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ అజయ్ బంగా సారథ్యంలోని బృందాన్ని శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కలిశారు. అనంతరం సీపీఎఫ్‌ను ఆమె స్వాగతించారు. ఇది కేవలం నిధుల సహకారానికి మాత్రమే కాకుండా, నాలెడ్జ్ షేరింగ్‌కు, టెక్నికల్ సపోర్ట్, జాబ్స్ తదితర వాటి విస్తరణకు గ్లోబల్ రేంజ్లో ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. ప్రభుత్వ నిధులను ఉపయోగించి ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగాలు సృష్టించడం కీలకమని చెప్పారు.
ప్రధాని మోదీ ఆకాంక్షించిన ‘వికసిత్ భారత్’ లక్ష్యాలకు అనుగుణంగా ఈ సీపీఎఫ్ ఉందని ప్రపంచ బ్యాంకు (World Bank) గ్రూప్ తెలిపింది. ప్రభుత్వ పెట్టుబడులతో పాటు ప్రైవేట్ మూలధనాన్ని కలిపి, ప్రపంచ బ్యాంకు గ్రూప్ అంతర్జాతీయ అనుభవాన్ని వినియోగించి, విస్తృత స్థాయిలో అభివృద్ధి ఫలితాలు సాధించవచ్చని వెల్లడించింది. ఏటా దాదాపు 1.2 కోట్ల మంది యువత భారత ఉద్యోగ రంగంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఇది అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశమని పేర్కొంది. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ను చేరుకునే దిశగా ఆర్థిక వృద్ధిని మార్చడమే ఈ భాగస్వామ్యం ఉద్ధేశ్యమని వెల్లడించింది.
Read Also: భారత్‌కు వరల్డ్ బ్యాంక్ గ్రూప్ భారీ గుడ్ న్యూస్
Follow Us On : WhatsApp


