epaper
Tuesday, November 18, 2025
epaper

ఎట్టకేలకు ఆ నిజం అంగీకరించిన ట్రంప్

గత కొన్నిరోజులుగా అమెరికా అధ్యక్షుడు భారత్ విషయంలో కఠిన వైఖరి అవలంభిస్తున్న విషయం తెలిసిందే. సుంకాలు విధించడం, ఎఫ్ 1బీ వీసాలకు సంబంధించి కఠిన నిబంధనలు విధించడం వంటి చర్యలకు పూనుకుంటున్నారు. రష్యాతో చమురు ఒప్పందం వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా ట్రంప్(Donald Trump) కాస్త మెత్తబడ్డట్టు కనిపిస్తోంది. అమెరికాలో నిపుణుల కొరత ఉందని ఆయన అంగీకరించడం గమనార్హం. ఆర్థిక, వలస విధానాల్లో స్పష్టమైన మార్పులు చేయబోతున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇంతకుముందు “అమెరికన్‌ ఉద్యోగాలు అమెరికన్లకే” అన్న ధోరణి కనబరిచిన ట్రంప్‌ వెనక్కి తగ్గారు.

విదేశీ నైపుణ్యాన్ని “దేశ ఆర్థిక వ్యవస్థకు అవసరమైన ఆస్తి”గా అభివర్ణించడం గమనార్హం.హెచ్ 1 బీ వీసా సంస్కరణలపై తన గత వైఖరి నుంచి కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. అమెరికా పరిశ్రమలు అంతర్జాతీయ ప్రతిభ లేకుండా ముందుకు సాగలేవని ఆయన అంగీకరించారు. “మా వద్ద కావాల్సిన స్థాయిలో నైపుణ్యం లేదు. అందుకే విదేశీ నిపుణులు అవసరం” అని ట్రంప్‌ ఓ వార్తా సంస్థకు వెల్లడించారు.

ట్రంప్(Donald Trump) తన వ్యూహాన్ని మార్చినట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ట్రంప్‌ “మేడ్ ఇన్ అమెరికా” భావజాలాన్ని ప్రోత్సహిస్తూ, వలస విధానాలపై కఠిన వైఖరి అవలంభించారు. రక్షణ, తయారీ, సాంకేతిక రంగాల్లో ప్రతిభా లోటు తలెత్తడంతో ప్రస్తుతం వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది.

జార్జియాలోని రక్షణ పరిశ్రమలో విదేశీ కార్మికులను తొలగించడంతో ఉత్పత్తి నిలిచిపోయిన ఉదాహరణను ట్రంప్‌ స్వయంగా ప్రస్తావించడం గమనార్హం. అమెరికా పారిశ్రామిక శక్తిని నిలబెట్టాలంటే అంతర్జాతీయ ప్రతిభను ఆహ్వానించక తప్పదనే ఆలోచన ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

అమెరికా వలస వర్గాల మనసు గెలుచుకుంటూనే, గ్లోబల్‌ ప్రతిభను వినియోగించుకునే ద్వంద్వ వ్యూహం అవలంభించాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యతలో అమెరికా ప్రభుత్వం మరిన్ని సడలింపులు తీసుకొస్తుందా? అన్నది వేచి చూడాలి.

Read Also: పేలుళ్ల ఘటనపై స్పందించిన అల్ ఫలాహ్ వర్సిటీ

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>