కలం, వెబ్ డెస్క్: ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender)పై అనర్హత వేటు పడటం ఖాయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) అన్నారు. నేడు దానం అనర్హత పిటిషన్‌పై విచారణ ప్రారంభమైన నేపథ్యంలో పాడి ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ బీఫాం మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసింది అందరూ చూశారన్నారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు స్పీకర్‌కు ఈరోజు చూపిస్తామన్నారు. తప్పకుండా దానంను సస్పెండ్ చేస్తారని చెప్పారు.
దానంపై అనర్హత కోరుతూ రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. పాడి కౌశిక్ రెడ్డి (Kaushik Reddy), మహేశ్వర్ రెడ్డి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. కౌశిక్ పిటిషన్‌పై స్పీకర్ విచారణ ప్రారంభించారు. మధ్యాహ్నం మహేశ్వర్ రెడ్డి పిటిషన్ పై విచారణ చేయనున్నారు. మరోవైపు దానం తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని కౌంటర్ దాఖలు చేశారు. దానం అడ్వొకేట్లు కౌశిక్, మహేశ్వర్ రెడ్డిని విచారించనున్నారు.
Read Also: నేటితో ముగియనున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ గడువు
Follow Us On: X(Twitter)


