కలం, వెబ్ డెస్క్: నిన్న మొన్నటి వరకు కొండెక్కిన బంగారం, వెండి ధరలు(Gold Silver Prices) శుక్రవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్లో తులం బంగారం ధర(Gold Price) రూ.8 వేలకు పైగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారం రూ.1,78,850 ఉండగా రూ.8,230 తగ్గి ప్రస్తుతం రూ.1,70,620గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారం రూ.1,63,950 ఉండగా నేడు రూ.7,550 తగ్గి రూ.1,56,400 గా ఉంది. ఇక కిలో వెండి ధర(Silver Price) రూ.10 వేల వరకు తగ్గింది. గురువారం రూ.4,25,000గా ఉన్న కిలో వెండి ధర నేడు రూ.10,000 తగ్గి ప్రస్తుతం రూ.4,15,000గా ఉంది.


