కలం, వెబ్ డెస్క్ : జాతిపిత మహాత్మా గాంధీ(Mahatma Gandhi) 78వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి సీఎం చంద్రబాబు (Chandrababu) ఘన నివాళి అర్పించారు. గాంధీజీ అహింసా విధానంతో కోట్ల మంది దేశప్రజలను ఒక్కతాటిపై నడిపి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించారు. జాతిపిత బోధనలైన సత్యం, అహింస, శాంతి, సేవ అనే సిద్దాంతాలను ప్రతి ఒక్కరూ నిత్యం పాటించాలి. స్వదేశీ, మహిళా సాధికారత, గ్రామ స్వరాజ్యం, పేదరిక నిర్మూలన వంటి గాంధీజీ ఆశయాలను నిజం చేసేందుకు చిత్తశుద్దితో పని చేద్దామని చంద్రబాబు ట్వీట్ చేశారు.


