epaper
Friday, January 30, 2026
spot_img
epaper

మెట్రో స్టేషన్‌లో వెంకీ, త్రివిక్రమ్ మూవీ షూటింగ్ .. వీడియో వైరల్

కలం, సినిమా : విక్టరీ వెంకటేశ్(Venkatesh) గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తన కెరీర్ లోనే భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కించిన ఆ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది. ఛాన్నాళ్ళ తరువాత సాలిడ్ హిట్ అందుకోవడంతో వెంకటేశ్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రస్తుతం వెంకటేశ్ తన తరువాత సినిమాను స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) తో చేస్తున్నాడు. వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతంలో వెంకటేశ్ నటించిన మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ వంటి సూపర్ హిట్ సినిమాలకు త్రివిక్రమ్ కథ, మాటలు అందించారు.

తాజాగా త్రివిక్రమ్ డైరక్షన్ లో వెంకటేశ్ నటిస్తుండటంతో ఆ సినిమా ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీకి “ఆదర్శ కుటుంబం”(Aadarsha Kutumbam) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. హౌస్ నెంబర్ 47 అనేది ట్యాగ్ లైన్‌గా ఉంచారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్  హైదరాబాద్‌లోని JBS పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్‌లో జరిగుతుంది. అందుకు సంబంధించిన వీడియో తాజాగా లీక్ అయింది.

ఈ సినిమాలో వెంకటేశ్ మిడిల్ క్లాస్ వ్యక్తిగా కనిపించనున్నారు. అందుకే మెట్రో స్టేషన్ సీన్స్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. రెండు రోజులపాటు ఆ మెట్రో స్టేషన్‌లో షూటింగ్ నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఆగష్టులో ఈ చిత్రం రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఈ సినిమాలో వెంకీ సరసన క్యూట్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా యంగ్ హీరో నారా రోహిత్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>