అక్కినేని నాగార్జున కుటుంబంపై గతంలో మంత్రి కొండా సురేఖ(Konda Surekha) చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పరువునష్టం కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా కొండా సురేఖ గతంలో చేసిన వ్యాఖ్యలకు పశ్చాతాపం వ్యక్తం చేశారు. ఎవరి మనసు నొప్పించాలన్న ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. “నాగార్జున(Akkineni Nagarjuna), ఆయన కుటుంబసభ్యుల పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది. వారిని బాధపెట్టాలనే ఉద్దేశంతో నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు. వారిని ఇబ్బందిపెట్టాలని కాని, వారి పరువు-ప్రతిష్టలకు భంగం కలిగించాలన్నది కాని నా ఉద్దేశం కాదు. నాగార్జున కుటుంబంపై నేను చేసిన వ్యాఖ్యల్లో ఏదైనా పొరపాటు జరిగి ఉంటే దానికి చింతిస్తున్నా. నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా” అని ఆమె పేర్కొన్నారు.
అదే సమయంలో, తన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, సోషల్ మీడియాలో అవి వేరే అర్థం వచ్చేలా ప్రదర్శించారని సురేఖ పేర్కొన్నారు. తాను కళాకారులను, ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమకు పెద్దసహకారం అందించిన అక్కినేని కుటుంబాన్ని గౌరవంగా చూస్తానని స్పష్టం చేశారు. మరి కొండా సురేఖ(Konda Surekha) పశ్చాతాపం వ్యక్తం చేశారు కాబట్టి.. నాగార్జున ఫ్యామిలీ పరువునష్టం కేసును ఉపసంహరించుకుంటుందా? ఆమె క్షమాపణతో ఆ కుటుంబం శాంతిస్తుందా? అన్నది వేచి చూడాలి.
Read Also: తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు
Follow Us on: Instagram

