కలం, వెబ్ డెస్క్: టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) తాజాగా తన రిటైర్మెంట్ వెనుక అసలు కారణాన్ని బయటపెట్టాడు. 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన యువీ.. ఇప్పుడు ఆ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో స్పష్టంగా చెప్పాడు. 2019 వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోవడంతో యువరాజ్ అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు IPL నుంచీ తప్పుకున్న విషయం తెలిసిందే.
అయితే ఆ సమయంలో తాను ఆటను ఆస్వాదించలేకపోయానని యువీ వెల్లడించాడు. తనకు మద్దతు, గౌరవం లభించలేదనే భావన కలిగిందని చెప్పాడు. అలాంటి పరిస్థితిలో ఇంకా ఎందుకు ఆడాలి అనిపించిందని, ఇక నిరూపించుకోవాల్సిందేమీ లేదని పేర్కొన్నాడు. మానసికంగా, శారీరకంగా తనకు ఇక కొనసాగడం సాధ్యం కాదని అర్థమైందని యువరాజ్ తెలిపాడు.
ఈ విషయాన్ని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో (Sania Mirza) జరిగిన ఓ పాడ్‌కాస్ట్‌లో ఆయన వెల్లడించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల పలువురు క్రికెటర్లు తమకు సంబంధించిన గత అనుభవాలను పంచుకుంటున్నారు. యువరాజ్ సింగ్ (Yuvraj Singh) రిటైర్మెంట్ ప్రకటించడం అప్పట్లో పెను సంచలనం. అయితే ఇప్పుడు ఆయన తనకు అవమానం జరిగిందని చెప్పుకోవడం గమనార్హం.
Read Also: శివమ్ దూబే సిక్సర్ల సునామీ ఇన్నింగ్స్ వృథా
Follow Us On: Sharechat


