కలం, నిజామాబాద్ బ్యూరో: ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) తీవ్రంగా ఖండించారు. తెలంగాణకు ప్రతిరూపం కేసీఆర్ అని, కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం అంటే యావత్ తెలంగాణ సమాజానికే నోటీసులు ఇచ్చినట్టేనని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపిన నాయకుడిపై చర్యలు తీసుకోవడం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడమేనన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో తీవ్ర అభద్రతా భావం పెరిగిపోయిందని, తన ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో కప్పిపుచ్చుకునేందుకు సిట్లు, కమిషన్ల పేరుతో డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపుతున్నారని ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు.
మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) వేళ ప్రజల దృష్టిని మళ్లించేందుకే డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. ఎన్నికల హామీలు అమలు చేయడం చేతకాదు కానీ.. పూటకో డైవర్షన్ డ్రామాలు చేస్తూ రేవంత్ రెడ్డి కాలం గడుపుతున్నాడని విమర్శించారు. తెలంగాణను ఆత్మగా భావించే కేసీఆర్ (KCR)ను సిట్ నోటీసులు ఏమీ చేయలేవని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు (KCR) నోటీసులు ఇచ్చి రేవంత్ రెడ్డి రాజకీయ సమాధిని తానే నిర్మించుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్ఎస్ ఎండగడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన మూల్యం తప్పదని వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) హెచ్చరించారు.
Read Also: నాంపల్లి ఫైర్ యాక్సిడెంట్ ఘటన.. హైడ్రా అధికారుల ఆకస్మిక తనిఖీలు
Follow Us On: X(Twitter)


