కలం, వెబ్ డెస్క్: కేంద్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) గురువారం పార్లమెంట్లో ఆర్థిక సర్వే(Economic Survey)ను ప్రవేశపెట్టారు. ఈ సర్వేలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి రేటును 7.4 శాతంగా అంచనా వేశారు. దీంతో భారత్ వరుసగా నాలుగో సంవత్సరం ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఆర్థిక సర్వే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పని తీరు, దేశ పరిస్థితిపై ఒక అధికారిక నివేదికగా ఉంటుంది. అలాగే కేంద్ర బడ్జెట్‌కు ముందు భవిష్యత్ విధానాలపై దిశానిర్దేశం చేస్తుంది. ఈ నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం తయారు చేస్తుంది. కేంద్ర బడ్జెట్ 2026–27ను ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు.


