కలం, వెబ్ డెస్క్: మహారాష్ట్ర దివంగత డిప్యూటీ సీఎం అజిత్ పవార్(Ajit Pawar) అంత్యక్రియలు ముగిశాయి. బారామతి(Baramati)లోని విద్యా ప్రతిష్టాన్ మైదానంలో ఈ అంత్యక్రియలు నిర్వహించారు. అజిత్ పవార్ అభిమానులు, రాజకీయ నాయకులు భారీగా తరలివచ్చి తమ అభిమాన నేతకు కన్నీటితో వీడ్కోలు పలికారు. అజిత్ పవార్ కుమారులు పార్థ్, జయ్ తండ్రి చితికి నిప్పంటించారు. శరత్ పవార్‌తో పాటు, కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం దేవేందర్ ఫడ్నవీస్ తదితర ప్రముఖులు అజిత్ పవార్ అంత్యక్రియలకు హాజరయ్యారు. మరోవైపు అజిత్ పవార్ విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ప్రమాదంపై అనుమానాలున్నాయని, ఇందులో కుట్ర కోణం ఉండవచ్చని పలువురు ఆరోపించారు. కాగా, శరత్ పవార్ మాత్రం ఈ ప్రమాదాన్ని రాజకీయ కోణంలో చూడవద్దని, ఇది ప్రమాదవశాత్తు జరిగిందని స్పష్టం చేశారు.


