కలం, వెబ్ డెస్క్: లిక్కర్ కేసు(liquor case)లో ఏపీ హైకోర్ట్ ముగ్గురికి బెయిల్ మంజూరు చేసింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి(Chevireddy Bhaskar Reddy), వెంకటేష్ నాయుడు, సజ్జల శ్రీధర్లకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కేసులో జైలులో ఉన్న రాజ్ కసిరెడ్డి, అవినాష్ బెయిల్ పిటిషన్లను హై కోర్ట్(High Court) డిస్మిస్ చేసింది. లిక్కర్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ గతేడాది జూన్ 17వ తేదీన అరెస్ట్ చేసింది. దాదాపు 226 రోజుల తర్వాత ఆయనకు బెయిల్ మంజూరైంది. లిక్కర్ కేసులో అక్రమ సొత్తును రాజ్ కసిరెడ్డి నుంచి చెవిరెడ్డి తీసుకున్నారని సిట్ అభియోగాల్లో పేర్కొంది.


