కలం, వెబ్ డెస్క్: బంగారం, వెండి ధరలు(Gold Silver Prices) రోజురోజుకూ మారిపోతున్నాయి. తాజాగా గురువారం బంగారం, వెండి ధరలు రికార్డ్ స్థాయిలో పెరిగిపోయాయి. ఒక్క రోజులోనే తులం బంగారం ధర రూ.11 వేలకు పైగా పెరిగిపోయింది. బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,67,080 ఉండగా గురువారం ఉదయం రూ.11,770 పెరిగి రూ.1,78,850కి చేరుకుంది. మరోవైపు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారం రూ.1,53,150 ఉండగా నేడు ఉదయం రూ.10,800 పెరిగి రూ.1,63,950కి చేరుకుంది. ఇక వెండి ధరలు సైతం విపరీతంగా పెరిగిపోయాయి.
ఒక్క రోజులోనే వెండి ధర దాదాపు రూ.25 వేలు పెరిగింది. బుధవారం వెండి ధర రూ.4 లక్షలు ఉండగా గురువారం ఉదయం రూ.25 వేలు పెరిగి రూ.4.25 లక్షలకు చేరుకుంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి జనవరి 28 వరకు 28 రోజుల్లోనే వెండి ధర రూ.1.44 లక్షలు పెరగడం విశేషం.
Read Also: భారత్-ఈయూ ఒప్పందంతో దేశానికి కొత్త అవకాశాలు : మోడీ
Follow Us On: Pinterest


