epaper
Tuesday, November 18, 2025
epaper

హైదరాబాద్-విజయవాడ హైవేపై బస్సు దగ్దం..

Bus Mishap | ఇటీవల వరస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్, విజయవాడ ప్రధాన రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. హైదరాబాద్ నుంచి కందుకూరు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన నల్గొండ జిల్లా చిట్యాల(Chityal) మండలం పిట్టంపల్లి(Pittampalli) సమీపంలోని చోటుచేసుకున్నది. బస్సు సిబ్బంది తక్షణమే ప్రయాణికులను అప్రమత్తంగా చేశారు. బస్సులోని 29 మంది ప్రయాణికులు సురక్షితంగా కిందకు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు.

హైదరాబాద్ నగరం నుంచి ఉదయం బయలుదేరిన ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ప్రకాశం జిల్లా కందుకూరు వైపు ప్రయాణిస్తోంది. బస్సు చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామం సమీపానికి చేరుకున్న వెంటనే ఇంజన్ భాగం నుంచి పొగలు రావడం ప్రారంభమైంది. క్షణాల్లోనే పొగ బస్సు అంతటా వ్యాపించి, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు డ్రైవర్ క్లీనర్ తక్షణమే ప్రయాణికులను అప్రమత్తం చేశారు.

Bus Mishap | ప్రయాణికులు డోర్లు తెరుచుకొని రోడ్డు పక్కనకు దూకి పరుగులు పెట్టారు. మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సు కొద్ది నిమిషాల్లోనే పూర్తిగా దగ్ధమైంది. ఘటన స్థలంలో బస్సు ఇనుప ఫ్రేమ్ మాత్రమే మిగిలింది, మిగతా భాగాలన్నీ బూడిదైపోయాయి. బస్సులో మొత్తం 29 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో మహిళలు, పిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారు. స్థానికులు, రోడ్డుపై వెళుతున్న ఇతర వాహన డ్రైవర్లు సహాయం అందించారు. ప్రయాణికులకు నీరు, ఆహారం అందించి, సమీపంలోని గ్రామాలకు తరలించారు. తరువాతి ఏర్పాట్ల కోసం ట్రావెల్స్ సంస్థ నుంచి మరో బస్సు పంపించారు.

అగ్నిమాపక సిబ్బంది చర్యలు

ఘటన జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. చిట్యాల, నల్గొండ నుంచి అగ్నిమాపక వాహనాలు రంగంలోకి దిగాయి. మంటలు పూర్తిగా అదుపులోకి తెచ్చినప్పటికీ, బస్సు దాదాపు 100 శాతం దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది రోడ్డు పక్కన ఉన్న పొలాలకు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఇంజన్ ఓవర్‌హీట్ కావడం లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

Read Also: మొదలైన పోలింగ్.. ఓటు వేసిన సునీత..

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>