కలం, తెలంగాణ బ్యూరో : సింగరేణ సంస్థకు సంబంధించి టెండర్ నోటిఫికేషన్లు, వాటిలోని నిబంధనలు, ప్రొక్యూర్‌మెంట్ పాలసీ, సీఎస్ఆర్ (CSR) నిధుల అవకతవకలు.. ఇలాంటి అంశాల్లో గవర్నర్‌గా జోక్యం చేసుకుని ఆ సంస్థను రక్షించాలని బీఆర్ఎస్ (BRS) రిక్వెస్ట్ చేసింది. లోక్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయిన బీఆర్ఎస్ డెలిగేషన్ మొత్తం ఆరు పేజీల లేఖను అందజేసింది. అనేక అంశాలను లేవనెత్తి చివరకు ఆరు విజ్ఞప్తులు చేసింది. ఈ ప్రతినిధి బృందంలో కేటీఆర్, హరీశ్‌రావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఉన్నారు. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాజ్యసభ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఎంక్వయిరీ జూబ్లీ హిల్స్ పోలీసు స్టేషన్‌లో జరుగుతున్న సమయంలోనే బీఆర్ఎస్ బృందం లోక్‌భవన్‌లో ఈ ఫిర్యాదు చేయడం గమనార్హం. ఆరు పేజీల లేఖలో పేర్కొన్న అంశాలపై గవర్నర్ చొరవ తీసుకోవాలని కోరినవాటిలో ముఖ్యమైనవి .. :
1. సింగరేణిలో జరుగుతున్న లోపాలు, అవకతవకలు, అవినీతి తదితరాలపై సమగ్రమైన ఇన్‌స్టిట్యూషనల్ దర్యాప్తు జరిపించాలి.
2. టెండర్ విధానం, ప్రొక్యూర్‌మెంట్ పాలసీ, సీఎస్ఆర్ నిధుల వినియోగం తదితరాలపై ప్రభుత్వానికి, సింగరేణి సంస్థ యాజమాన్యానికి తగిన సూచనలు చేసి పారదర్శకత నెలకొనేలా చొరవ తీసుకోవాలి.
3. ‘సైట్ విజిట్ తప్పనిసరి’ అనే నిబంధనను టెండర్ నోటిఫికేషన్‌లో పేర్కొనడం ద్వారా ఆరోగ్యకరమైన పోటీ ఉండనందున ఓపెన్ కాస్ట్ మైనింగ్ టెండర్ల విషయాన్ని రివ్యూ చేయాలి, ఇప్పటివరకు ఇచ్చిన టెండర్లను రద్దు చేయాలి.
4. తరచూ వాయిదా వేస్తున్న ఎక్కువ విలువ కలిగిన ప్రకాశ్‌ఖని టెండర్ల ప్రక్రియను సమీక్షించాలి.
5. సింగరేణి సంస్థలో జవాబుదారీతనాన్ని, పారదర్శకతను బలోపేతం చేసేలా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి.
6. రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల నిధులు దుర్వినియోగం కాకుండా, ఆ సంస్థలకు నష్టం జరగకుండా నివారణా చర్యలపై దృష్టి పెట్టాలి.

Read Also: నా మూలాలు భారత్‌లో : ఆంటోనియో కోస్టా
Follow Us On: Sharechat


