సుంకాలను వ్యతిరేకిస్తున్న వారిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఘాటు వ్యాఖ్యలు చేశారు. సుంకాలను వ్యతిరేకించే వారంతా మూర్ఖులని అన్నారు. ఎవరు ఏమనుకున్నా తాను విధించిన సుంకాల ద్వారా దేశానికి మేలే జరుగుతుందని అన్నారు. ప్రపంచదేశాలపై సుంకాలను విధిస్తూ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ సుంకాల వ్యవహారంపై న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలవుతుండగా.. ఇదంతా చూస్తుంటే తనకు నవ్వొస్తుందని అన్నారు. ఇదంతా కూడా హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కానీ సుంకాల(Tariffs) వల్ల భారీ ఆదాయం వస్తుందని, డివిడెండ్ కింద ఒక్కో అమెరికన్‌కు కనీసం 2వేల డాలర్లు ఇస్తామని హామీ ఇచ్చారు.
‘‘సుంకాలకు వ్యతిరేకంగా మాట్లాడేవారంతా మూర్ఖులు. ఇప్పుడు మనది ప్రపంచంలో అత్యంత ధనిక, గౌరవనీయమైన దేశం. ద్రవ్యోల్బణం దాదాపు లేదు. స్టాక్ మార్కెట్లు కూడా రికార్డ్ స్థాయిలో దూసుకెళ్తున్నాయి. త్వరలోనే దేశ ఆర్థిక వ్యవస్థ 37 ట్రిలియన్ల డాలర్ల రుణాన్ని చెల్లించం మెదలుపెడతం. డివిడెండ్ కింద ఒక్కో వ్యక్తికి కనీసం 2వేల డాలర్లు చెల్లిస్తాం’’ అని Donald Trump వెల్లడించారు.
Read Also: జైళ్లో మందు పార్టీ.. అధికారులు ఏం చేస్తున్నట్టు?
Follow Us on: Instagram

