కలం, వెబ్ డెస్క్: సింగరేణి బొగ్గు కేటాయింపుల్లో అవినీతి (Singareni Coal Scam) జరిగిందంటూ చాలా రోజులుగా బీఆర్ఎస్ (BRS) ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై బీఆర్ఎస్ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేయబోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో పూర్తిగా కూరుకుపోయిందని, ముఖ్యంగా సింగరేణి సంస్థలో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని యథేచ్ఛగా లూటీ చేశారంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో పార్టీ ప్రతినిధి బృందం గవర్నర్‌నుకలిసి, సింగరేణిలో జరిగిన అవినీతికి సంబంధించిన పూర్తి వివరాలు, సాక్షాధారాలతో కూడిన నివేదికను సమర్పించనుంది. ఈ కుంభకోణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతోపాటు పలువురు మంత్రులు నేరుగా భాగస్వాములయ్యారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
సింగరేణి వంటి ప్రతిష్టాత్మక సంస్థలో జరిగిన ఈ భారీ అవినీతి (Singareni Coal Scam) వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరనున్నట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ఈ భేటీలో పార్టీకి చెందిన ముఖ్య ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర సీనియర్ నాయకులు పాల్గొని గవర్నర్‌కు తమ నిరసనను తెలియజేయనున్నారు.
Read Also: రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన బీజేపీ ఫైట్.. ప్రభుత్వంపై ఒత్తిడికి రేపు ప్రొటెస్ట్
Follow Us On : WhatsApp


