మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan).. ప్రస్తుతం ‘పెద్ది(Peddi)’ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో పరుగులు పెడుతున్నాడు. ఈ సందర్బంగానే చెర్రీ మాట్లాడుతూ.. ఈ సినిమాతో తన కల ఒకటి నెరవేరిందని అన్నాడు. అదేంటంటే.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఏఆర్ రెహ్మాన్(AR Rahman) సంగీతంలో భాగమవ్వడం అని అన్నాడు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన రెహ్మాన్ మ్యూజిక్ కాన్సర్ట్‌లో చెర్రీ పాల్గొన్నాడు. ఇందులో మాట్లాడుతూ.. ‘‘రెహ్మాన్ సంగీతంలో భాగం కావాలన్నది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న కల. అది ‘పెద్ది’తో నెరవేరింది. అందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని చెర్రీ చెప్పాడు.
అయితే పెద్ది(Peddi) సినిమాలో ‘చికిరి చికిరి’ అన్న పాటను రెహ్మాన్ తనయుడు ఏఆర్ అమీన్ స్వయంగా పాడాడు. దీంతో ఆ సినిమాకు ఆ పాట ప్రత్యేక ఆకర్షణగా నలిచింది. ఇక ఏఆర్ రెహ్మాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘యువ’ సినిమాలో ‘జన గణ మన’ పాటతో ప్రారంభమైన తన కెరీర్.. అంతర్జాతీయ స్థాయికి చేరింది. అనేక సినిమాలకు అతడు అందించిన మ్యూజిక్ అంటే ఇప్పటికే చెవి కోసుకునేవారు ఎందరో. తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన మ్యూజిక్ కాన్సర్ట్‌లో రెహ్మాన్.. అనేక తెలుగు పాటలను ఆలపించాడు ఇందులో భాగంగానే తెలుగు సంగీతంపై తన గౌరవాన్ని చాటుకున్నారు. తన కెరీర్ తొలి అడుగులు పడింది తెలుగు పరిశ్రమ నుంచేనని చెప్పారు. ఇళయరాజా, ఎంఎస్ విశ్వనాథన్ లాంటి సంగీత దిగ్గజాలతో పని చేసిన రోజులు ఇప్పటికీ తనకు మధుర జ్ఞాపకాలేనని చెప్పుకొచ్చాడు రెహ్మాన్.
Read Also: చిరుకు ఆర్‌జీవీ సారీ.. అసలేం జరిగిందంటే..!
Follow Us on : Pinterest

