టీమిండియాకు వరుస ఎదరుదెబ్బలు తగులుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరుగా ప్లేయర్లు గాయాలబారిన పడుతున్నారు. సౌతాఫ్రికాతో స్వదేశంలో రెండు మ్యాచ్‌ల టెస్ట్ పోరుకు ముందు ఈ దెబ్బలు జట్టుకు భారీ దెబ్బగా మారుతున్నాయి. దక్షిణాఫ్రికా-ఏ.. ఆ దేశంలోనే ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఒకరి తర్వాత ఒకరుగా ప్లేయర్లు గాయాలతో వెనుదిరుగుతున్నారు. మొన్న కెప్టెన్ రిషబ్ పంత్(Rishabh Pant), ఆ తర్వాత ధృవ్ జురెల్ గాయాలబారిన పడ్డారు. కాగా, తాజాగా ఆదివారం బౌలర్ మహమ్మద్ సిరాజ్(Mohammed Siraj) కూడా గాయంతో వెనుదిరిగాడు. గాయమైనా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు సిరాజ్. కానీ వరుస గాయాలతో ఇండియాలో సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్‌ల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వారి అప్పటికి వీళ్లు రికవర్ అవుతారా? కాకుంటే వాళ్ల స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? అన్న చర్చ మొదలైంది.
అయితే సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ ఆదివారం నాలుగో రోజుకు చేరుకుంది. ఇందులో టీమిండియా సెకండ్ వీకపర్ ధృవ్ జురేల్ వేలికి గాయమైంది. అతడు రెండు ఇన్నింగ్స్‌లలో సెంచూరియన్‌గా నిలిచాడు. అతడు గాయంతో వెనుదిరగడంతో టీమిండియాకు బలమైన బ్యాటర్ దూరమయ్యాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇంతలోనే ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సిరాజ్ చేతి వేలికి గాయమవడం టీమిండియా ఫ్యాన్స్ కలవరపెడుతోంది. సిరాజ్(Mohammed Siraj) గాయం పెద్దది కాకపోయినా ముందు జాగ్రత్తగా నొప్పితో విలవిలలాడిన సిరాజ్ మైదానాన్ని వీడాడు. సిరాజ్ గాయం పెద్దదేమీ కానప్పటికీ.. ముందు జాగ్రత్తగా అతనికి విశ్రాంతి కల్పించారు.
Read Also: చిరుకు ఆర్‌జీవీ సారీ.. అసలేం జరిగిందంటే..!
Follow Us on : Pinterest

