మెగాస్టార్ చిరంజీవికి డైనమిక్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ్(RGV) సారీ చెప్పాడు. తన తొలి సినిమా ‘శివ’ రీరిలీజ్ సందర్భంగా ఆర్‌జీవీకి చిరంజీవి కంగ్రాట్స్ చెప్పాడు. దీంతో చిరంజీవి రిప్లైకి థాంక్స్ చెప్తూనే క్షమాపణలు కూడా అడిగాడు ఆర్‌జీవీ. ఈ మేరకు ఆర్‌జీవీ ఓ వీడియోను ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేసుకున్నాడు. అందులో.. ‘‘థాంక్స్ చిరంజీవి(Chiranjeevi)గారు. అనుకోకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే ఈ సందర్భంగా క్షమాపణలు కోరుతున్నా. మీరు మీ విశాల హృదయంతో మా టీమ్‌ని విష్ చేశారు. అందుకు కృతజ్ఞతలు’’ అని ఆర్‌జీవీ చెప్పుకొచ్చాడు.
అయితే అసలు ఆర్‌జీవీ(RGV) సారీ ఎందుకు చెప్పాడు అన్నది సోషల్ మీడియాలో మిలియన్ డాలర్ల ప్రశ్నలా చర్చలకు దారితీస్తోంది. దీంతో చిరంజీవి, ఆర్‌జీవీ కాంబోలో ఓ సినిమా రావాల్సి ఉందని, కొన్ని అనివార్య కారణాలతో ఆగిపోయిందని, అందుకే ఇప్పుడు సారీ చెప్తున్నాడంటూ నెటిజన్స్ అభిప్రాయాలు చెప్తున్నారు. చిరు హీరోగా ‘వినాలని ఉంది’ అన్న సినిమా తీయాలని ఆర్‌జీవీ అనుకున్నారు. అయితే అసలు ఎందుకు సారీ చెప్పారన్న దానిపై ఆర్‌జీవీ అయితే ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. మరి త్వరలో దీనిపై స్పష్టత వస్తుందేమో చూడాలి.
Read Also: నాణ్యమైన నిద్ర అంటే గంటల తరబడి పడుకోవడం కాదు..!
Follow Us on: Instagram

