కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలో పలువురు ఉన్నతాధికారులను బదిలీ (DSPs transfers) చేస్తూ డీజీపీ(DGP) బి. శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సివిల్ విభాగంలోని పది మంది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారులకు ఈ బదిలీలు వర్తిస్తాయి.
ఈ ఉత్తర్వుల ప్రకారం హైదరాబాద్ సిటీ ఏసీపీ ఎల్. ఆదినారాయణను కొత్తగూడెం ఎస్డీపీఓగా నియమించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న షేక్ అబ్దుల్ రహ్మాన్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ సీటీసీ ఏసీపీ డి.వి. ప్రదీప్ కుమార్ రెడ్డిని ఆదిబట్ల ఏసీపీగా, సీఐడీ డీఎస్పీ ఎం. ఆదిమూర్తిని మియాపూర్ ట్రాఫిక్ ఏసీపీగా బదిలీ చేశారు. మల్కాజ్‌గిరి ఏసీపీగా ఉన్న ఎస్. చక్రపాణిని జవహర్ నగర్ ఏసీపీగా, ఎస్‌బీ ఏసీపీ బి. మోహన్ కుమార్‌ను మేడిపల్లి ఏసీపీగా నియమించారు.
సిద్దిపేట టాస్క్ ఫోర్స్ ఏసీపీ బి. రవీందర్ భోంగీర్ ఎస్డీపీఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. యాంటీ నార్కోటిక్ బ్యూరో డీఎస్పీ సి.హెచ్. శ్రీధర్ హైదరాబాద్ మహంకాళి ఏసీపీగా నియమితులయ్యారు. టీజీపీఏ డీఎస్పీ ఎస్. సారంగపాణిని ఇల్లందు ఎస్డీపీఓగా పంపించగా, అక్కడ పనిచేస్తున్న ఎన్. చంద్రభానును డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. బదిలీ అయిన అధికారులందరూ తక్షణమే విధుల్లో చేరాలని డీజీపీ తెలిపారు.
Read Also: భిక్ల్యా, సిమాంచల్.. తొంభైయ్యేళ్ల కళా ‘పద్మా’లు
Follow Us On: Sharechat


