కలం, వెబ్ డెస్క్ : జనవరి 27న (మంగళవారం) దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు (Bank Employees) సమ్మెకు పిలుపునిచ్చారు. ఐదు రోజుల పని విధానం (Five Days Work week) అమలు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ఈ సమ్మె నిర్వహించనున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఆ రోజు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని సమాచారం.


