కలం, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను (Padma Awards) ప్రకటించింది. వీరిలో ఈ సారి తెలంగాణ రాష్ట్రానికి ఏడు అవార్డులు దక్కాయి. వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని అవార్డులకు ఎంపిక చేశారు. వైద్యరంగంలో పాలకొండ విజయానందర్ రెడ్డి పద్మ శ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. వీరికి వైద్య రంగంలో 30 ఏండ్లకుపైగా అనుభవం ఉంది. పాలకొండ బంజారాహిల్స్‌లోని ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్స్‌తో రేడియేషన్ ఆంకాలజీ విభాగంలో ఆయన సుప్రసిద్ద వైద్యులు.
తెలంగాణ నుంచి పద్మ అవార్డులకు (Padma Awards) ఎంపికైన ప్రముఖులు వీరే..
వైద్యరంగం: పాలకొండ విజయానంద్ రెడ్డి
వైద్యరంగం: గూడూరు వెంకట్రావు
సైన్స్ & ఇంజినీరింగ్: గద్దమణుగు చంద్రమౌళి
సైన్స్ & ఇంజినీరింగ్: కృష్ణమూర్తి బాలసుబ్రమణ్యన్
సైన్స్ & ఇంజినీరింగ్: కుమారస్వామి తంగరాజ్
కళలు: దీపికారెడ్డి
సామాజిక సేవ: మామిడి రామారెడ్డి
మొత్తం అవార్డులలో 5 మంది పద్మ విభూషణ్, 13 మంది పద్మభూషణ్, 113 మంది పద్మశ్రీ గ్రహీతలు ఉన్నారు. అవార్డు గ్రహీతల్లో 19 మంది మహిళలు, ఆరుగురు విదేశాల పౌరులు, 16 మంది మరణానంతరం అవార్డులు పొందినవారు ఉన్నారు. అమెరికాలో స్థిరపడిన డాక్టర్ నోరి దత్తాత్రేయుడు (క్యాన్సర్ స్పెషలిస్టు)కు పద్మ భూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. దత్తాత్రేయుడు స్వస్థలం ఏపీలోని కృష్ణా జిల్లా. ఈయన తెలంగాణ ప్రభుత్వంలో సలహాదారుగా (ప్రివెంటివ్, క్యురేటివ్, క్యాన్సర్) నవంబరు 29న నియమితులయ్యారు.
Read Also: పుస్తక నేస్తం అంకెగౌడ.. అక్షర యోగికి అందిన పద్మం
Follow Us On: X(Twitter)


