ఆస్ట్రీలియాతో ఆడుతున్న టీ20 సిరీస్‌ను భారత్ కైవశం చేసుకుంది. వరుణుడి దెబ్బకు సిరీస్ భారత్‌కు దక్కింది. బ్రిస్బేస్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదో టీ20 స్టార్ట్ అయింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. బరిలోకి దిగిన భారత బ్యాటర్లు బంతులను అంచనా వేస్తూ అప్పుడప్పుడే పుంజుకుంటున్నారు. అభిషేక్ శర్మ 13 బంతుల్లో 23 పరుగులు చేశాడు. శుభ్‌మన్ గిల్ కూడా మరోవైపు 16 బంతుల్లో 29 పరుగులతో వేగం పెంచుతున్నాడు. ఇంతలో వాతావరణం ఒక్కసారిగా మారింది. కారుమబ్బులు కమ్మి నిమిషాల్లో వర్షం మొదలైంది. కాసేపు వేచి చూసిన అంపైర్లు మ్యాచ్‌ను తిరిగి ప్రారంభించే అవకాశం లేదన్న నిర్ణయానికి వచ్చి మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో భారత్.. సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ స్టార్టింగ్‌లో టాస్ ఓడిపోవడంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్(Suryakumar Yadav) కీలక వ్యాఖ్యలు చేశాడు.
టాస్ ఓడిపోవడంపై బుమ్రా ‘మళ్ళీ ఓడిపోయావా’ అని సెటైర్ వేశాడు. కాగా బ్యాటింగ్ చేయనున్నట్లు సూర్యకుమార్ సైగ చేశాడు. అంతకుముందే టాస్ ఓడిపోవడంపై రవిశాస్త్రితో మాట్లాడిన సూర్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్‌లు గెలుస్తున్నంత సేపు టాస్ గెలిచినా, ఓడినా ఫరక్ పడదని అన్నాడు. అది అసలు పెద్ద సమస్యే కాదన్నాడు. ఇప్పుడు సిరీస్ భారత్ సొంతం కావడంతో సూర్యకుమార్(Suryakumar Yadav) మాటలు హాట్ టాపిక్‌గా మారాయి.
Read Also: ఆస్ట్రేలియాపై అదరగొట్టిన అభిషేక్.. రికార్డ్ బ్రేక్
Follow Us on: Youtube

