కలం, వెబ్ డెస్క్: నాంపల్లి అగ్ని ప్రమాదంలో (Nampally Fire Accident) మృతి చెందిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. నాంపల్లిలోని బట్చాస్ ఫర్నీచర్ షాప్‌లో శనివారం జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 22 గంటల సుధీర్ఘ రెస్క్యూ అనంతరం వీరి మృతదేహాలను నేడు ఉదయం వెలికితీశారు. ఈ అంశంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) స్పందించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తామని తెలిపారు.
ఈ మేరకు జిల్లా కలెక్టర్ హరి చందనకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. షాపు యజమాని నిర్లక్ష్యమే ప్రమాదానికి (Nampally Fire Accident) కారణమని తేలిందని, నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని మంత్రి తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో అగ్నిమాపక నిబంధనలను మరింత కఠినతరం చేయాలని అధికారులను ఆదేశించారు.
Read Also: డెలివరీ బాయ్స్ దౌర్జన్యం.. సెక్యూరిటీపై దాడి
Follow Us On: Sharechat


