కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ సోలార్ తయారీ హబ్‌గా ఆవిర్భవిస్తుందని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. ఆంధ్రప్రదేశ్ దక్షిణాన నాయుడుపేటలో ప్రీమియర్ ఎనర్జీస్ (Premier Energies) ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ సోలార్ సెల్, వెఫర్, ఇంగాట్ తయారీ కేంద్రం వేగంగా ముందుకెళ్తుంది. మొత్తం ₹6,200 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటుంది.
ఇందులో భాగంగా ₹4,200 కోట్లతో చేపట్టిన తొలి దశ సోలార్ సెల్ తయారీ పనులు ఇప్పటికే 50 శాతం పూర్తి అయ్యాయి. ఈ యూనిట్‌ను 2026 జూన్ నాటికి ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌తో ఆంధ్రప్రదేశ్ సౌర విద్యుత్ తయారీ రంగంలో కీలక కేంద్రంగా ఎదుగుతూ, దేశపు గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలకు శక్తినిస్తుందని లోకేశ్ ట్వీట్ చేశారు.
Read Also: టీడీపీ ఎమ్మెల్యేతో ముద్రగడ భేటీ.. ఆంతర్యం ఏమిటి?
Follow Us On: Instagram


