కలం, వెబ్ డెస్క్: తెలంగాణ పోలీసులు నిషేధిత డ్రగ్స్(Drugs)పై ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా పలుచోట్ల విక్రయాలు, వినియోగం యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్(Hyderabad)లోని పంజాగుట్టలో పలువురు విద్యార్థులు డ్రగ్స్ తీసుకోవడం కలకలం రేపింది. పంజాగుట్ట(Panjagutta)లోని నాగార్జున సర్కిల్ వద్ద ఓ కాలేజీలో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో డ్రగ్స్ వినియోగిస్తున్న ఐదుగురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 10 గ్రాముల ఎండీఎంఏ(MDMA) డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. వీరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.


