కలం, వెబ్ డెస్క్: నాంపల్లిలో (Nampally) శనివారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో (Fire Accident) మంటలు ఆదివారం ఉదయమైనా చల్లారలేదు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 17 గంటలుగా రెస్క్యూ (Rescue) కొనసాగుతోంది. సెల్లార్లోకి వెళ్లేందుకు మరో మార్గం లేకపోవడంతో మంటలు ఆర్పడం కష్టంగా మారింది. ప్రమాదం జరిగిన భవనానికి మూడు రోజుల క్రితమే విదేశాల నుంచి భారీగా ఫర్నీచర్ స్టాక్ వచ్చింది. ఈ క్రమంలో యజమానులు రెండు సెల్లార్లలో ఫర్నీచర్‌ను నిల్వ చేశాడు. ఆ ఫర్నీచర్ అంతా మంటల్లో దగ్ధమవుతుండటంతో లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చే దారి లేకుండా పోయింది. భవనం అంతా దట్టమైన పొగ కమ్ముకోవడంతో పరిసరాల్లోకి వెళ్లడమే కష్టంగా మారింది. మరికొద్ది సేపట్లో ఘటనా స్థలానికి జేఎన్టీయూ ఇంజినీరింగ్ టీం రానుంది. భవనంపై అధికారులకు కీలక నివేదిక సమర్పించనుంది.
Read Also: పద్మశ్రీ అవార్డులు ప్రకటించిన కేంద్రం
Follow Us On : WhatsApp


