కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాడుతున్న భాష ఏమాత్రం సరిగా లేవని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti) విమర్శించారు. శనివారం మీడియా చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ, కేటీఆర్ స్థాయికి సమాధానం చెప్పడానికి తాను ఒక్కడినే చాలని పేర్కొన్నారు.
మున్సిపల్ ఎన్నికలను (Municipal Elections) కేటీఆర్ రిఫరెండంగా అభివర్ణించడాన్ని మంత్రి తప్పుబట్టారు. గతంలో రెండుసార్లు కేటీఆర్ రిఫరెండం అని చెప్పి ఓడిపోయారని, ఇప్పుడు మళ్లీ అదే మాట మాట్లాడుతున్నారని అనారు. గతంలో కూడా ఏం జరిగిందో, ఇప్పుడు కూడా అదే జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వం ఎలాంటి సోయి లేకుండా, శాస్త్రీయత లేకుండా జిల్లాలను ఏర్పాటు చేసిందని, ఇప్పుడు అగ్నిగుండం చేస్తామంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజల అభిప్రాయాలను తీసుకుని, పూర్తి శాస్త్రీయ పద్ధతిలో జిల్లాల పునర్ వ్యవస్ధీకరణ చేపడతామని మంత్రి (Ponguleti) తెలిపారు.
బట్టకాల్చి మీద వేయడమే ప్రతిపక్ష పార్టీ పని అన్నట్లుగా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని అన్నారు. తమ రెండేళ్ల పాలనలో ఎలాంటి తప్పులు జరగకపోయినా, గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను గుర్తు చేసుకుంటూ ప్రస్తుతం కూడా అలాగే జరుగుతోందని భ్రమపడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఇంకా తాము అధికారంలోనే ఉన్నామనే భ్రమలో ఉన్నారని, మళ్ళీ అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని పొంగులేటి పేర్కొన్నారు.
Read Also: నా 40 ఏళ్ల రాజకీయ జీవితంపై మచ్చ వేశారు : డిప్యూటీ సీఎం భట్టి
Follow Us On: Instagram


