కలం, మహబూబాబాద్ : మహబూబాబాద్ (Mahabubabad) మండలం బలరాం తండాలో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో ఆరు సంవత్సరాల బాలుడు పడిపోయాడు. బాలుడిని రక్షించడం కోసం బావిలోకి తండ్రి మదన్ దిగాడు. కొడుకును వెతికే క్రమంలో తండ్రి కూడా మృతి చెందాడు. బావిలో ఉన్న విద్యుత్ వైర్లు తండ్రీకొడుకుల మరణానికి కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహాల వద్ద వారి రోదనలు మిన్నంటాయి.
Read Also: నాంపల్లి అగ్ని ప్రమాద ఘటన.. వెలుగులోకి సంచలన నిజాలు
Follow Us On: X(Twitter)


