epaper
Saturday, January 24, 2026
spot_img
epaper

క్రెడిట్ కార్డు బిల్లులు కట్టలేకపోతున్నారా.. ఇలా చేస్తే సిబిల్ స్కోర్ తగ్గదు..!

కలం, వెబ్ డెస్క్ : ఈ రోజుల్లో క్రెడిట్ కార్డులతో షాపింగులు చేస్తున్న వారి సంఖ్య కోట్లలోనే ఉంది. మన ఇండియాలోనే 40 శాతం మందికి పైగా ఈ క్రెడిట్ కార్డులతో షాపింగులు చేస్తున్నారు. క్రెడిట్ కార్డుల ద్వారా కొంటే వచ్చే ఆఫర్లు, ఇన్ టైమ్ లో వడ్డీ లేకుండా పేమెంట్ చేసుకునే ఆప్షన్ల వల్ల వీటి వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. అయితే క్రెడిట్ కార్డుల బిల్లులు (Credit Card) కట్టలేక పోతే కచ్చితంగా సిబిల్ స్కోర్ తగ్గుద్ది. చాలా మంది డబ్బులున్నా బిల్లు పేమెంట్ టైమ్ కు మర్చిపోతుంటారు. ఒకవేళ డబ్బులు లేకపోతే ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడుతారు. కాబట్టి స్మార్ట్ టిప్స్ ద్వారా ఈ బిల్లులను మేనేజ్ చేసుకుని.. సిబిల్ స్కోర్ ను కాపాడుకోవచ్చు. ఆ టిప్స్ ఏంటో ఒకసారి చూద్దాం.

సాలరీ వచ్చిన వెంటనే..

జీతం వచ్చిన వెంటనే మీ క్రెడిట్ కార్డు బిల్లును కట్టేయండి. క్రెడిట్ కార్డు బిల్లు (Credit Card Bills) పేమెంట్ నెలాఖరుకు ఉంది కదా.. అప్పటికి చూద్దాం అనుకుంటే మీకే నష్టం. ఆ లోపు మీ సాలరీ అమౌంట్ వేరే ఖర్చులకు అయిపోతే.. క్రెడిట్ కార్డు బిల్లు కట్టేందుకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. టైమ్ కు కట్టకుంటే ఫైన్లు పడటం, సిబిల్ స్కోర్ తగ్గడం వల్ల మీకే నష్టం.

లాస్ట్ దాకా చూడొద్దు..

బిజినెస్ లు, ఇతర పనులు చేసుకునే వారికి నెల జీతాలు రావు. ఇలాంటి వారు బిల్లు పేమెంట్ చివరిరోజు చూసుకుందాంలే అనుకోవద్దు. చివరి రోజు టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేదా మీ అకౌంట్ లో డబ్బులు లేకపోవడం, బ్యాంక్ సర్వర్ల సమస్యలు వస్తే బిల్లు పేమెంట్ కాదు. కాబట్టి కుదిరితే నాలుగైదు రోజుల ముందే లేదా గడువు తేదీకి ఒక రోజు ముందు పేమెంట్ చేసుకుంటే బెటర్.

చెక్ చేస్తూ ఉండాలి..

బ్యాంకుల నుంచి క్రెడిట్ కార్డు బిల్లుల గురించి వచ్చే ఈ మెయిల్స్, మెసేజ్ లను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. అలా చేస్తే గడువు తేదీ గుర్తుకొస్తూ ఉంటుంది. దాని వల్ల పేమెంట్ డ్యూ డేట్ వరకు మనీ అరేంజ్ చేసుకోవచ్చు. అలాగే బ్యాంకులు ఏమైనా అడిషనల్ ఛార్జీలు వేశాయా అనేది కూడా తెలుసుకోవచ్చు. ఒకవేళ ట్రాన్సాక్షన్లు తప్పుగా జరిగినా ముందే అలర్ట్ అయి జాగ్రత్త పడొచ్చు.

ఆటోమేటిక్ పేమెంట్స్..

ఈ రోజుల్లో బ్యాంకు అకౌంట్ లో డబ్బులున్నా.. బిల్లు కట్టే డేట్లు మర్చిపోయి ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య కోకొల్లలు. కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ నుంచి క్రెడిట్ కార్డు బిల్లు పేమెంట్ డేట్ రోజు ఆటోమేటిక్ గా కట్ అయ్యేలా Auto-pay ఆప్షన్ ను యాక్టివేట్ చేసుకోవాలి. అప్పుడు మీరు మర్చిపోయినా ఇబ్బంది ఉండదు. కాకపోతే మీ అకౌంట్ లో పేమెంట్ డేట్ వరకు డబ్బులు ఉండేలా చూసుకోవాలి.

డబ్బులు లేకపోతే ఎలా..?

గడువు తేదీ నాటికి క్రెడిట్ కార్డు బిల్లు మొత్తానికి సరిపోయేంత డబ్బులు లేకపోతే కచ్చితంగా మినిమమ్ డ్యూ అయినా చెల్లించండి. దీని వల్ల డిఫాల్టర్ నుంచి తప్పించుకోవచ్చు. కానీ మిగిలిన అమౌంట్ మీద వడ్డీ పడుతూ ఉంటుంది. కాబట్టి మినిమమ్ అమౌంట్ పే చేసి వదిలేయకుండా వీలైనంత త్వరగా కంప్లీట్ బిల్లు చెల్లించండి. బిల్లు మరీ ఎక్కువగా ఉంటే దాన్ని ఈఎంఐ ఆప్షన్ లోకి మార్చుకోండి. అంతే గానీ క్రెడిట్ కార్డు బిల్లులు అసలే కట్టకుండా వదిలేస్తే మీ సిబిల్ స్కోర్ దారుణంగా పడిపోతుంది. బ్యాంకుల నుంచి లీగల్ నోటీసులు రావడం.. రికవరీ ఏజెంట్లు మీ ఇంటికి రావడం, ఫోన్ కాల్స్ లాంటివి ఇబ్బందిగా ఉంటాయి. బిల్లులు వడ్డీతో సహా చెల్లించడం తప్పకపోగా.. సిబిల్ స్కోర్ తగ్గితే భవిష్యత్ లో మీకు ఎలాంటి లోన్లు కూడా రావు. ఇలా చేస్తే ఏ బ్యాంకులు కూడా క్రెడిట్ కార్డులు మీకు ఇవ్వవు. కాబట్టి ఈ టిప్స్ ను ఫాలో అయి ఈజీగా బిల్లులు కట్టేయండి.

Read Also: బంగారం కొంటున్నారా.. ఈ విషయాలు తెలియకుంటే మోసపోతారు..!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>