epaper
Saturday, January 24, 2026
spot_img
epaper

డిప్యూటీ సీఎం భట్టికి హరీశ్​ రావు కౌంటర్

కలం, వెబ్​ డెస్క్​ : బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని చెప్పకుండా మసిపూసి మారేడు కాయ చేశారని బీఆర్​ఎస్​ మాజీ మంత్రి హరీశ్​ రావు (Harish Rao) రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై మండిపడ్డారు. సింగరేణికి సంబంధించిన టెండర్లపై బీఆర్​ఎస్​, బీజేపీ చేస్తున్న ఆరోపణలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం ఉదయం ప్రెస్​ మీట్​ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భట్టి (Bhatti Vikramarka) చేసిన వ్యాఖ్యలకు హరీశ్​ రావు కౌంటర్​ ఇచ్చారు. స్కామ్ జరగకపోతే టెండర్లు ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. నిష్పక్షపాతంగా విచారణ చేస్తామంటే తప్పకుండా భట్టి విక్రమార్క కే లేఖ రాస్తానని ఆయన స్పష్టం  చేశారు.

సైట్ విజిట్​ చేయడం.. నైని కోల్​ బ్లాక్ (Naini Coal Block) టెండర్లు రద్దు చేయడం అంటే అవినీతి జరిగినట్లే కదా అని హరీశ్​ రావు నిలదీశారు. భట్టి ఎన్ని సాకులు చెప్పినా బొగ్గు కుంభకోణం జరిగింది వాస్తవమేనని.. అందులో సీఎం రేవంత్​ రెడ్డి బావమరిది రింగ్​ మెన్​ పాత్ర పోషించడం నిజమని ఆయన ఆరోపించారరు. భట్టి విక్రమార్క అంటే తనకు చాలా గౌరవం ఉందని.. బొగ్గు కుంభకోణంపై సిట్టింగ్ జడ్జీ, సీబీఐ విచారణకు కేంద్రమంత్రి కిషన్​ రెడ్డికి లేఖ రాశాన్నారు. సీఎం రేవంత్​ రెడ్డి, అతని బావమరిదిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తామని హామీ ఇస్తే లేఖ రాస్తా అని హరీశ్​ రావు (Harish Rao) వెల్లడించారు.

Read Also: మున్సిపల్ ఎన్నికల్లో పోటీపై కవిత సంచలన నిర్ణయం ?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>