కలం, వెబ్ డెస్క్: ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారంపై మంత్రి వివేక్ వెంకటస్వామి (Minister Vivek) సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఇష్టారాజ్యంగా ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. నిబంధనల ప్రకారం సీఎస్‌కు తెలియకుండా ఫోన్లు ట్యాప్ చేయొద్దని.. కానీ ఆ రూల్స్ మొత్తం బ్రేక్ చేశారని పేర్కొన్నారు. గతంలో ఫోన్ ట్యాపింగ్‌కు బాధ్యులు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌లేనని ఆరోపించారు. హరీశ్ రావు, కవిత ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని.. వారు కూడా ఈ వ్యవహారంలో బాధితులేనని పేర్కొన్నారు.
గతంలో కేసీఆర్, కేటీఆర్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని .. తమకు తోచినట్లు నిర్ణయాలు తీసుకుని అధికారాన్ని దుర్వినియోగం చేశారని వివేక్ ఆరోపించారు. ఈ వ్యవహారం ప్రజాస్వామ్యానికి, పౌరుల మౌలిక హక్కులకు తీవ్ర భంగం కలిగించేదని ఆయన పేర్కొన్నారు.
చట్టవిరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన అధికారులు ఎవరిగా ఉన్నా వదిలిపెట్టకూడదన్నారు. ఇల్లీగల్ పనులు చేసిన అధికారులపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని, ప్రజలు ఎవరిని నమ్మాలో తెలుసుకునే రోజు దగ్గర్లోనే ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి (Minister Vivek) వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని కూడా స్పష్టం చేశారు.
Read Also: క్రెడిట్ కార్డు బిల్లులు కట్టలేకపోతున్నారా.. ఇలా చేస్తే సిబిల్ స్కోర్ తగ్గదు..!
Follow Us On: Sharechat


