కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ శివారులో గంజాయి ముఠా కారుతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ జి.సౌమ్య (Soumya) ను నిజామాబాద్ కలెక్టర్ (Nizamabad Collector) ఇలా త్రిపాఠి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఆసుపత్రి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సౌమ్య కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పారు. సౌమ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. విధి నిర్వహణలో ఉన్న ఎక్సైజ్ ఉమెన్ కానిస్టేబుల్‌పై హత్యా యత్నానికి పాల్పడడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, బాధ్యులైన వారికి కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీస్ కమిషనర్‌ను కోరతామని అన్నారు.
సౌమ్య వెంటిలేటర్‌పై ఉన్నారని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ 48 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచాలని వైద్యులు తెలిపినట్లు కలెక్టర్ వెల్లడించారు. సౌమ్య ఆరోగ్యం సహకరించిన వెంటనే ఉన్నత స్థాయి వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించేలా ఏర్పాట్లు చేశామని, ఆమె వైద్యం కోసం అయ్యే ఖర్చును ప్రభుత్వ పరంగా అందించడం జరుగుతుందని తెలిపారు. కలెక్టర్ (Nizamabad Collector) వెంట ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, సూపరింటెండెంట్ మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.
Read Also: యాదాద్రిలో ఐఏఎస్, ఐపీఎస్‌ల ఆదర్శ వివాహం
Follow Us On : WhatsApp


