కలం, నల్లగొండ బ్యూరో: యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లాలో ఐఏఎస్(IAS), ఐపీఎస్(IPS) అధికారులు ఆదర్శ వివాహం(Wedding) చేసుకున్నారు. వారు కావాలనుకుంటే అంగరంగ వైభవంగా వందలాది మంది వీఐపీల మధ్య వివాహం చేసుకోవచ్చు. కానీ వారు ఆ దిశగా ఆలోచించలేదు. యువతరానికి ఆదర్శంగా నిలిచేలా సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఎలాంటి ఆడంబరాలు లేకుండా పెళ్లి చేసుకొని అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. వివరాల్లోకి వెళితే.. చౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడెంకి చెందిన యువ ఐపీఎస్ అధికారిని శేషాద్రిని రెడ్డి (IPS Sheshadrini Reddy) ప్రస్తుతం కుత్బుల్లాపూర్ డీసీపీగా పని చేస్తున్నారు.
కడప జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి (IAS Srikanth Reddy) ఐఏఎస్ ట్రైనింగ్ లో ఉన్నారు. వీరిద్దరూ ఎలాంటి ఆడంబరాలు లేకుండా చౌటుప్పల్ రిజిస్టర్ కార్యాలయంలో శనివారం వివాహం చేసుకున్నారు. కొంతమంది సన్నిహితుల మధ్య సాదాసీదాగా కార్యాలయానికి వచ్చి పెళ్లి (IAS IPS Wedding) చేసుకోవడంతో నూతన దంపతులను పలువురు అభినందించారు. వీరి పెళ్లికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Read Also: నా 40 ఏళ్ల రాజకీయ జీవితంపై మచ్చ వేశారు : డిప్యూటీ సీఎం భట్టి
Follow Us On: Pinterest


